" దక్షిణ దిశగా" అన్న పేరు జీవితం దక్షిణ దిశగా ప్రయాణం చెయ్యటాన్ని సూచిస్తుంది. కర్నాటక సంగీతంలో యెమ్యే చేస్తున్న నలుగురు మిత్రుల జీవితాలలో ఎదురైన సమస్యలు, అవి ముందుకు తెచ్చిన ప్రశ్నలు, వాటి సమాధానాలకోసం అన్వేషించడం కథలో ముఖ్యమైన భాగం . ఒంటరితనం, అ...
" దక్షిణ దిశగా" అన్న పేరు జీవితం దక్షిణ దిశగా ప్రయాణం చెయ్యటాన్ని సూచిస్తుంది. కర్నాటక సంగీతంలో యెమ్యే చేస్తున్న నలుగురు మిత్రుల జీవితాలలో ఎదురైన సమస్యలు, అవి ముందుకు తెచ్చిన ప్రశ్నలు, వాటి సమాధానాలకోసం అన్వేషించడం కథలో ముఖ్యమైన భాగం . ఒంటరితనం, అభధ్రతా భావం, భయం, అర్థరాహిత్యం, అనివార్యమైన మరణం - ఇవి కథలోని పాత్రలు ఎదుర్కొనే సమస్యలు . దైవానుగ్రహం అనేది వుందా , జీవితానికి ముందే నిర్ణయించిన అర్థం వుందా , అన్నవి కూడా కథలో కీలకమైన ప్రశ్నలే . జీవితం ప్రతి అడుగులో ఛాయిస్ చేయవలసి వున్నప్పుడు , ఛాయిస్ దేని ఆధారంగా చెయ్యాలి ? అనుగ్రహం బయట నుండి వస్తుందా లేక మనలోనుండే వస్తుందా? వంటి ప్రశ్నలతో సాగే కథ ఎటువంటి ముగుంపుకు వస్తుంది అన్నది వుత్కంఠ కలిగించే విషయం .కథలో సజీవ వ్యక్తులు, సంఘటనలు తప్ప , తాత్విక చర్చలు లేవు . ఆద్యంతం కథ ఆసక్తి కరంగా సాగి , వూహించని విద్గంగా ముగింపుకు వస్తుంది.